News January 7, 2026
కరీంనగర్‌లో హుస్నాబాద్ విలీనం ఖాయమేనా?

హుస్నాబాద్ నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలో ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌ను KNRలో విలీనం చేయాలని సీఎంకి పలుమార్లు విన్నవించారు. ఈ క్రమంలో మరోసారి జిల్లాల పునర్విభజన పరిశీలిస్తామని మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రకటించారు. ఒకే జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేలా చేస్తామని చెప్పడంతో హుస్నాబాద్ KNRలో విలీనం ఖాయమన్న చర్చ నడుస్తుంది.
Similar News
News February 9, 2026
NCERTలో 117 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

<
News February 9, 2026
ASF: జనసేన బోణీ కొడుతుందా?

ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో జనసేన తరఫున మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన ఇక్కడ బోణీ కొడుతుందా? లేక ప్రజల మద్దతు లేక యూ టర్న్ తీసుకుంటుందా..? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ నడుస్తున్న వేళ జనసేన ఫలితం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
News February 9, 2026
BREAKING: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,240 పెరిగి రూ.1,58,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,050 ఎగసి రూ.1,45,600 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది.


