News January 7, 2026

కరీంనగర్‌లో హుస్నాబాద్‌ విలీనం?

image

హుస్నాబాద్ నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలో ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌ను KNRలో విలీనం చేయాలని సీఎంకి పలుమార్లు విన్నవించారు. ఈ క్రమంలో మరోసారి జిల్లాల పునర్విభజన పరిశీలిస్తామని మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రకటించారు. ఒకే జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేలా చేస్తామని చెప్పడంతో హుస్నాబాద్ KNRలో విలీనం ఖాయమన్న చర్చ నడుస్తుంది.

Similar News

News February 9, 2026

SAVE ‘RDT’

image

అనంతపురం జిల్లాలో పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశా కిరణం ఆర్డీటీకి FCRA పునరుద్ధరణ కాకపోవడంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు జిల్లా ప్రజాప్రతినిధులు సమస్యను వివరించారు. అయినా అనుమతులు రాకపోవడంతో విద్య, వైద్య, క్రీడా రంగాల సేవలపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో లైసెన్స్ పునరుద్ధరణ కోరుతూ ప్రజా సంఘాలు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నాయి.

News February 9, 2026

శ్రీశైలంలో నేడు బృంగివాహన సేవ

image

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు మల్లన్న బృంగివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3 వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు.

News February 9, 2026

మార్కాపురం: లోయలో పడిన కారు.. ఒకరి మృతి

image

మార్కాపురం జిల్లాలో విషాదం నెలకొంది. CSపురం ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ వివరాల ప్రకారం.. కురిచేడు మండలానికి చెందిన విష్ణు భార్గవ్(25) గత నెల 17న తిరుమలనాథ స్వామి తిరుణాల నిమిత్తం కోనపల్లికి కారులో వెళ్లాడు. తిరిగి వస్తుండగా CSపురం మండలం తుంగోడు ఘాట్ రోడ్డు లోయలో కారు పడిపోయింది. ఇవాళ ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.