News April 14, 2024
కరీంనగర్‌లో SUMMER CRICKET

క్రికెట్ ప్లేయర్లకు HYD క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. HCA ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లాల వారిగా సమ్మర్ క్యాంప్ మొదలుపెడుతామని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్‌రావు తెలిపారు. ఉచితంగానే ఈ క్యాంప్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.
కేంద్రాల వివరాలు:
కరీంనగర్: 80087 29397,
గోదావరిఖని: 98663 51620,
సిరిసిల్ల: 94943 62362.
Similar News
News September 11, 2025
గర్భిణులకు పీహెచ్‌సీలలో కాన్పులు చేయించాలి: DMHO

కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన ఆశా ఫెసిలిటేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పీహెచ్‌సీ) మొదటి కాన్పుల కోసం గర్భిణులను ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా సాధారణ ప్రసవాలు జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.
News September 10, 2025
KNR: ‘దివ్యాంగులు జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోండి’

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం దివ్యాంగులు ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మనోహర స్వామి తెలిపారు. టెన్త్ సర్టిఫికేట్ ఆధారంగా www.pwdjob.portal.telangana.gov.in వెబ్‌సైట్‌లో ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలని కోరారు. ఈ పోర్టల్ ద్వారా 300కు పైగా కంపెనీలలో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
News September 10, 2025
KNR: TGCPGET ఫలితాల్లో SRR జంతు శాస్త్ర విద్యార్థుల రాష్ట్రస్థాయి ర్యాంకులు

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలోని జంతు శాస్త్ర విభాగంలో విద్యార్థి ఏ.శివప్రసాద్ రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించారు. దీనితో పాటుగా ఎన్.ఆదిత్య 40వ ర్యాంకు, సీహెచ్. శివాజీ 70వ ర్యాంకు, జె.సంహిత 100 ర్యాంకు, కే.సాయితేజ 107, అనేక మంది విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, జంతుశాస్త్ర విభాగాధిపతి డా.కె.కిరణ్మయి విద్యార్థులను సన్మానించారు.