News February 14, 2025

కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

image

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

Similar News

News September 18, 2025

సిద్దిపేట: ‘2 BHK ఇళ్లకు లబ్దిదారులను ఎంపిక చేయాలి’

image

జిల్లాలో నివాసయోగ్యమైన రెండు పడక గదుల ఇళ్లలో ఎంపిక చేసిన లబ్ధిదారులు మాత్రమే నివాసం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో 2 BHK ఇళ్ల మంజూరు, లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింత, ఇతర ప్రగతి పనులపై తహశీల్దార్, మున్సిపల్, హౌసింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News September 18, 2025

iOS 26పై యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు

image

ఐఫోన్ 11, ఆ తర్వాతి మోడల్స్‌కి iOS 26 స్టాండర్డ్ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. కొందరు లిక్విడ్ గ్లాస్ న్యూ డిజైన్, యాపిల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్, లాక్ స్క్రీన్, హోం స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ బాగున్నాయంటున్నారు. మరికొందరు ‘బ్యాటరీ వెంటనే డ్రెయిన్ అవుతోంది, ఫోన్ వేడెక్కుతోంది’ అని ఫిర్యాదు చేస్తున్నారు. మేజర్ అప్‌డేట్ ఇలాంటివి సహజమేనని త్వరలోనే అంతా సర్దుకుంటుందని యాపిల్ కంపెనీ చెబుతోంది.

News September 18, 2025

మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు జేఎంజే విద్యార్థులు

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ జేఎంజే విద్యార్థినీలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అనిత తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ మహేశ్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.