News April 11, 2024
కరీంనగర్: ఇంకా ఐదు రోజులే!

పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఓటు హక్కు నమోదు అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకోసం పెద్దపల్లి జిల్లాలో 18 సంవత్సరాలు నిండినవారిపై బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఆరా తీస్తున్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 15 లోపు నూతన ఓటు నమోదు, సవరణల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు. 25న తుది జాబితా విడుదల చేయనున్నారు.
Similar News
News February 22, 2026
రేపు యథావిధిగా ‘ప్రజావాణి’: జిల్లా కలెక్టర్

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఉదయం నిర్ణీత సమయానికి అధికారులు హాజరై ఫిర్యాదులను స్వీకరిస్తారని పేర్కొన్నారు.
News February 22, 2026
భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వరద కాలువ, మిడ్ మానేరు, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి, రైతుల ప్రయోజనాల దృష్ట్యా భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.