News March 23, 2024
కరీంనగర్: ఇంకా 9 రోజులే గడువు
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను, ఇతర పన్నుల రాయితీ చెల్లింపు మార్చి 31 వరకు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఉమ్మడి KNR జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఇప్పటివరకు సగం వాటిలో 80% వరకు పన్ను వసూళ్లు జరిగాయి. ప్రభుత్వం ప్రకటించిన 90 వడ్డీ రాయితీతో చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. KNR నగరంలో ఇటీవల ఓ వ్యక్తి 24 ఏళ్ల పెండింగ్ బకాయిలు చెల్లించారు.
Similar News
News January 6, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ తంగళ్ళపల్లి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. @ గంభీరావుపేట మండలంలో కారు అదుపుతప్పి ఇద్దరికి గాయాలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సిరిసిల్ల ఎస్పీ. @ జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు. @ మంథనిలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు. @ గంగాధర మండలంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం.
News January 5, 2025
కరీంనగర్: స్థానిక పోరుకు సన్నద్ధం..!
కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.
News January 5, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ. 2,70,067 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,30,094 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.69,300, అన్నదానం రూ.70,673 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.