News April 7, 2025
కరీంనగర్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవి కుమార్ తెలిపారు. డిగ్రీ చదివి బీసీ-ఏ, బీ, డీకి చెందిన అభ్యర్థులు ఈనెల 8లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 0878-2268686 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News July 6, 2025
రేపటి నుంచి పెరగనున్న భక్తుల రద్దీ

నెల్లూరులోని బారాషహిద్ దర్గా వద్ద నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుంది. అన్ని గ్రామాల్లో జరుగుతున్న మొహర్రం వేడుకలు ఆదివారంతో ముగుస్తాయి. దీంతో నేడు బారాషహిద్ దర్గా వద్ద భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమవారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దర్గా వద్ద పోలీస్ అధికారులు 1700 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
News July 6, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8గంటల వరకు 38.0 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా మహదేవ్‌పూర్ 3.8, మల్హర్‌రావు 11.2, మొగుళ్లపల్లి 6.2, రేగొండ 2.4, ఘన్‌పూర్ 13.4, భూపాలపల్లి 1.0 మి.మీటర్ల వర్షం నమోదైంది.
News July 6, 2025
ఆప్షనల్ సెలవులు స్కూళ్లకు కాదు: పాఠశాల విద్యాశాఖ

AP: ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవులపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవులు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇవి స్కూలు మొత్తానికి ఇచ్చేందుకు కాదని చెప్పారు. అటు ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, ఎవరైనా ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ బడుల్లో కనిపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.