News December 23, 2025
కరీంనగర్: ఉచిత శిక్షణ.. దరఖాస్తు గడువు పొడిగింపు

IELTSలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువు JAN 11 వరకు పొడగించామని జిల్లా BC అభివృద్ధి అధికారి రంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. విదేశాలలో ఉన్నత విద్య చదివేందుకు స్కాలర్ షిప్లు పొందటానికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తరగతులకు హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తైన విద్యార్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.
Similar News
News December 27, 2025
మంత్రి రవీంద్ర పేరిట మోసం.. రూ.1.15 కోట్లు టోకరా.!

మంత్రి కొల్లు రవీంద్రకు ఏజెంట్లుగా పనిచేస్తున్నాం.. లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామంటూ రూ.1.15 కోట్లు వసూలు చేసిన వంకాయలపాటి రాంబాబు, సాయికిరణ్‌పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. SVN కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా లిక్కర్ మార్ట్ మంజూరు కాలేదు. బాధితుడు మంత్రిని కలవగా వారు తనకు తెలియదని చెప్పడంతో మోసపోయానని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
News December 27, 2025
అగర్‌బత్తుల్లో ఆ కెమికల్స్‌పై బ్యాన్

ప్రపంచంలో అగర్‌బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. BIS (Bureau of Indian Standards) ‘IS 19412:2025’ అనే కొత్త ప్రమాణాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం అగర్‌బత్తుల తయారీలో హానికరమైన అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్ వంటి క్రిమిసంహారకాలు, కొన్ని సింథటిక్ సువాసన రసాయనాల వినియోగాన్ని నిషేధించింది.
News December 27, 2025
విశాఖలో ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఇవ్వాల్సిన సామాజిక భద్రతా పింఛన్లను డిసెంబర్ 31న ముందుగానే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆ రోజు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారని చెప్పారు. పంపిణీ సజావుగా జరిగేందుకు డిసెంబర్ 30న నగదు డ్రా చేసేందుకు ఆదేశించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.


