News February 11, 2025
కరీంనగర్: ఊరంతా బీసీ కమ్యూనిటీ వారే..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739255213252_1259-normal-WIFI.webp)
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఊరంతా బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉండటం గమనార్హం. గ్రామంలో 750 జనాభా ఉండగా 623 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఆరె, పద్మశాలి, కుర్మ, ముదిరాజ్, కమ్మరి, వడ్రంగి కులాలు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి కులాలకు చెందిన వారు లేరు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కమ్యూనిటీ వారికే అవకాశం లభిస్తుంది.
Similar News
News February 11, 2025
శ్రీ సత్యసాయి: గురుకుల పాఠశాల సమీపంలో పసికందు లభ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739275757313_51971370-normal-WIFI.webp)
బత్తలపల్లిలోని మారుతీ నగర్ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాల వద్ద మంగళవారం ఓ పసికందు లభ్యమైంది. పాఠశాల సమీపంలో పసికందు అరుపులు వినిపించడంతో స్థానికులు ఆ పసికందును ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు అందజేస్తున్నారు. పసికందును అక్కడ ఎవరు వదిలి వెళ్లారనే విషయంపై అధికారులు, స్థానికులు ఆరా తీస్తున్నారు.
News February 11, 2025
సూపర్ హిట్ వెబ్‌సిరీస్ సీక్వెల్ రెడీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739265637553_695-normal-WIFI.webp)
ఐశ్వర్యా రాజేశ్, కథిర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సుడల్: ది వర్టిక్స్’ సీక్వెల్ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2022లో విడుదలై పార్ట్-1 సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. పుష్కర్-గాయత్రి తెరకెక్కించిన ఈ సిరీస్ IMDb రేటింగ్ 8.1 సాధించడంతో పాటు 30 భాషల్లో స్ట్రీమింగ్ అయ్యింది.
News February 11, 2025
MHBD: అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠినచర్యలు : SP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739270374440_50007403-normal-WIFI.webp)
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామానాథ్ కేకన్ ఆకేరు నది పరివాహక ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. ఇసుకను అక్రమరవాణా చేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తున్నాయని క్షేత్రస్థాయిలో పర్యటించామన్నారు. ఇక నుంచి అనుమతులు లేకుండా ఎవరు కూడా ఇసుకను తరలించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.