News February 11, 2025
కరీంనగర్: ఊరంతా బీసీ కమ్యూనిటీ వారే..!

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఊరంతా బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉండటం గమనార్హం. గ్రామంలో 750 జనాభా ఉండగా 623 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఆరె, పద్మశాలి, కుర్మ, ముదిరాజ్, కమ్మరి, వడ్రంగి కులాలు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి కులాలకు చెందిన వారు లేరు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కమ్యూనిటీ వారికే అవకాశం లభిస్తుంది.
Similar News
News December 15, 2025
మూడు దేశాల పర్యటనకు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15 నుంచి 18 వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 15-16న జోర్డాన్, 16-17న ఇథియోపియా, 17-18న ఒమన్‌కు ఆయన వెళ్తారు. ‘లింక్ వెస్ట్’ పాలసీ, ‘ఆఫ్రికా ఇనిషియేటివ్’లో భాగంగా ఆ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్నారు.
News December 15, 2025
వంజరపల్లిలో ఉపసర్పంచ్ ఎన్నిక.. ఇతనే సర్పంచ్ నా ఇక..?

వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లిలో మోర్తల చందర్ రావు ఆరో వార్డు నుంచి గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వ్ కావడంతో గిరిజనులు లేకపోవడం కారణంగా సర్పంచ్ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. ఇదే పరిస్థితితో 1, 4, 5 వార్డుల్లోనూ ఎస్టీకి రిజర్వు కాగా నామినేషన్లు నమోదు కాలేదు. గ్రామంలో 2, 3, 6, 7, 8 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. దీంతో సర్పంచ్ ఇతనేనా..?
News December 15, 2025
రామడుగు హరీష్‌కు ‘ఒక్క’ ఓటు అదృష్టం!

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామడుగు హరీష్ సంచలన విజయం సాధించారు. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన హరీష్‌పై అందరి దృష్టి పడింది. ఆయన తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్కే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఒక ఓటుతో గెలుపొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని హరీష్ తెలిపారు.


