News June 6, 2024

కరీంనగర్: ఎక్సైజ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సూసైడ్

image

ఎక్సైజ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. CI విజయ్‌కుమార్‌ ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన రవి (54)KNR ఎక్సైజ్‌ అర్బన్‌ స్టేషన్‌లో HCగా పని చేస్తున్నారు. ఇంటి కోసం లోన్‌ తీసుకున్నారు. లోన్‌ కట్టడంలో ఇబ్బంది, పిల్లల చదువుకు డబ్బు సరిపోవడం లేదని 4 నెలల కింద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉంటున్న రవి.. బుధవారం డ్యూటీకి వెళ్లి వచ్చి ఉరేసుకున్నారు. కేసు నమోదైంది.

Similar News

News December 14, 2025

కరీంనగర్‌లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలోని ఐదు మండలాల్లో జరుగుతున్న పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని, 162 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని స్క్రీన్‌లపై పోలింగ్ ప్రక్రియను వీక్షించిన కలెక్టర్, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షించారు.

News December 14, 2025

లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్‌గా నీలం చంద్రారెడ్డి గెలుపు

image

తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం చంద్రారెడ్డి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి కరివేద శ్యాంసుందర్ రెడ్డిపై 34 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వల్ప మెజార్టీతో గెలుపొందిన చంద్రారెడ్డికి గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మద్దతుదారు గెలుపొందడంతో లక్ష్మీదేవిపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

News December 14, 2025

కరీంనగర్ జిల్లాలో 84.63% పోలింగ్ నమోదు

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 84.63% పోలింగ్ కాగా, చిగురుమామిడిలో 85.82%. గన్నేరువరంలో 88.55%, మానకొండూరులో 82.34%, శంకరపట్నంలో 84.98%, తిమ్మాపూర్ లో 84.83% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 185003 ఓట్లకు గాను 156568 ఓట్లు పోలయ్యాయి.