News December 16, 2025

కరీంనగర్: ఎన్నికల బందోబస్తుకు 877 మంది పోలీసు సిబ్బంది

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 877 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఇందులో ఆరుగురు ఏసీపీలు, 20 ఇన్స్పెక్టర్లు, 39 ఎస్సైలు, 40 ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుల్స్, 460 కానిస్టేబుళ్లు, 35 స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 178 హోంగార్డులు, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులు, అదనంగా ఎన్‌సీసీ సభ్యులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

Similar News

News April 4, 2026

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదుపై కరీంనగర్ సీపీ సమీక్ష

image

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. ఎస్‌హెచ్‌ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. మహిళలు, చిన్నారుల కేసుల్లో వీడియో రికార్డింగ్, ఎస్‌ఓపీలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

KNR జిల్లా తిమ్మాపూర్ లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు “బ్యూటీ పార్లర్ మెనేజ్ మెంట్” లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 18-45 సం.ల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, శిక్షణ ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు.