News February 14, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకుల నియామకం

MDK-NZB -KNR-ADB పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల పరిశీలకులను నియమించిందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులకు ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిశీలకులు సంజయ్ కుమార్ 9398416403, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిశీలకులు మహేశ్ దత్ 7993744287లను సంప్రదించాలన్నారు.
Similar News
News February 10, 2026
విశాఖకు మెట్రో రైలు.. 3 రూట్లు ఇవే

AP: సుమారు 46KM పొడవు, 3 కారిడార్లు, రూ.11,500 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ మెట్రోకు కేంద్రం ఓకే చెప్పింది.
*30-35KM దూరంతో స్టీల్ ప్లాంట్(గాజువాక)-కొమ్మాది మధ్య అత్యంత పొడవైన కారిడార్ ఏర్పాటు కానుంది.
*సిటీలో ట్రాఫిక్ తగ్గించేందుకు 5-6KM దూరంతో గురుద్వారా జంక్షన్-ఓల్డ్ పోస్టాఫీస్ వరకు రెండో కారిడార్ రానుంది.
*6-7KM దూరంతో పర్యాటకం+సిటీని కలుపుతూ తాటిచెట్లపాలెం-RK బీచ్ వరకు మూడో కారిడార్ వస్తుంది.
News February 10, 2026
డ్రోన్ పెట్రోలింగ్‌తో కర్నూలు పోలీసుల స్మార్ట్ నిఘా

కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ జిల్లా పోలీసు శాఖ డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించింది. డీజీపీ కార్యాలయం నుంచి కేటాయించిన 3 నూతన డ్రోన్ కెమెరాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆవిష్కరించారు. డే, నైట్ విజన్ సౌకర్యంతో పనిచేసే ఈ డ్రోన్లు జిల్లావ్యాప్తంగా నిరంతర నిఘా నిర్వహించనున్నాయి. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కాలేజీలు, పాఠశాలల ప్రత్యేక నిఘాకు ఉపయోగపడతాయన్నారు.
News February 10, 2026
GWL: పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్: ఎస్పీ

మున్సిపల్ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 163 BNS (144 సెక్షన్) అమల్లో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆ పరిధిలో గుంపులుగా ఉండరాదన్నారు. పోలింగ్ పూర్తి అయ్యేవరకు సైలెంట్ పిరియడ్ అమల్లో ఉంటుందని ఆ సమయంలో సభలు, సమావేశాలు, ప్రచారం పూర్తిగా నిషేధమన్నారు. అక్రమ మద్యం కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


