News February 25, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోరు

ఉమ్మడి KNR, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి?
Similar News
News February 25, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా…

కరీంనగర్ జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఈదులగట్టేపల్లి 38.4°C నమోదు కాగా, గంగిపల్లి 38.3, పోచంపల్లి 38.1, కొత్తపల్లి-ధర్మారం 37.9, నుస్తులాపూర్ 37.8, తాంగుల, జమ్మికుంట 37.6, వీణవంక, కరీంనగర్ 37.4, ఖాసీంపేట 36.9, బురుగుపల్లి 36.7, గట్టుదుద్దెనపల్లె 36.6, తాడికల్, గంగాధర 36.4, చిగురుమామిడి, వెదురుగట్టు, ఇందుర్తి 36.3, అర్నకొండ 36.2, దుర్శేడ్ 36.1°C గా నమోదైంది.
News February 25, 2025
కరీంనగర్: యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలి: కలెక్టర్

ప్రైవేట్ మేనేజ్మెంట్, అథారిటీలలో పనిచేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి, వెసులుబాటు ఇవ్వాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు షిఫ్టుల సర్దుబాటు, డ్యూటీ గంటల తగ్గింపు, ఆలస్యంగా హాజరుకావడానికి అనుమతి వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
News February 25, 2025
కరీంనగర్: ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు

ఉమ్మడి KNR, MDK, NZB, ADB జిల్లాలో ఈ నెల 27న జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.