News March 5, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీ కౌంటింగ్.. 23 మంది ఎలిమినేట్

image

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అధికారులు చేయనున్నారు. లెక్కింపునకు ముందు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికి 23 స్వతంత్ర అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Similar News

News November 10, 2025

గుంటూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో కూడా సమర్పించవచ్చని, అదేవిధంగా 1100 నంబర్‌కి డయల్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News November 10, 2025

కరివేపాకు మొక్కలు గుబురుగా పెరగాలంటే?

image

కరివేపాకు మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగాక మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. మూడేళ్లు వచ్చిన కరివేపాకు చిన్న కొమ్మలను మొక్క మొదలు వరకు తుంచి, 4 లేదా 5 శాఖలు ఉండేలా ఉంచితే ఎక్కువ దిగుబడి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అలాగే పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులను మొక్కలకు వేస్తూ ఉండాలి.

News November 10, 2025

‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లా ప్రజలకు సూచించారు. ఈ నెల 10న కలెక్టరేట్‌లో యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన కోరారు.