News September 10, 2024
కరీంనగర్: ఎమ్మెల్సీ పదవికి ఎత్తుగడలు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం ప్రకటన జారీ చేసింది. దీంతో ప్రధాన పార్టీలు బలమైన నాయకులను పోటీలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆశావహులు కూడా పోటీలో నిలబడేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.
Similar News
News February 15, 2026
హుజురాబాద్ : నీళ్లు లేని ఫైర్ ఇంజన్… కళ్లముందే ఇల్లు బూడిద!

హుజూరాబాద్‌లోని మారుతినగర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో రిఫ్రిజిరేటర్ పేలి ఇల్లు దగ్ధమైంది. అద్దెకు ఉంటున్న దాసారపు మధునమ్మ ఇంట్లో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. గూన పెంకుల ఇల్లు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. హుజురాబాద్ ఫైర్ ఇంజన్‌లో ప్రారంభంలోనే నీరు లేకపోవడం విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి జమ్మికుంట ఫైర్ ఇంజన్ వచ్చి స్థానికుల సహాయం తో మంటలు అదుపులోకి తెచ్చినా భారీ ఆస్తి నష్టం జరిగింది.
News February 15, 2026
కరీంనగర్ మేయర్ పీఠం కమలం వశమే!

కరీంనగర్ నగరపాలక సంస్థలో కమల వికాసం ఖాయమైంది. బీజేపీ గెలిచిన 30 స్థానాలకు తోడు, ఇప్పటికే ఇద్దరు చేరగా.. తాజాగా శనివారం మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ బలం ఎక్స్-అఫీషియో ఓటుతో కలిపి 35కు చేరి, మ్యాజిక్ ఫిగర్ (34) దాటింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు తాజా చేరికలతో గండిపడింది.
News February 14, 2026
KNR: కాంగ్రెస్ నేతపై దాడి.. కేసు నమోదు

కరీంనగర్ రాజకీయ కక్షలతో కాంగ్రెస్ నాయకుడు శ్యాంసుందర్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కార్పొరేటర్ భూమయ్య భార్యకు మద్దతుగా ప్రచారం చేశారనే కోపంతో, మాజీ కార్పొరేటర్ సోదరుడు జంగిలి సతీశ్‌తో పాటు మరికొందరు ఆయనపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.


