News February 28, 2026

కరీంనగర్: ఎలక్ట్రిక్ వాటర్ వీల్స్ అందజేసిన కేంద్ర మంత్రి

image

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ కుమార్ శనివారం హైదరాబాదులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కుమ్మరి వృత్తి శిక్షణ పొందిన వారికి ఎలక్ట్రిక్ పాటర్ వీల్స్ అందజేశారు. ‘గ్రామోద్యోగ వికాస్ యోజన’ పథకంలో భాగంగా గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించడానికి వీలుగా అధునాతన పనిముట్లు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. సంబంధిత శాఖ ఉద్యోగులు, వృత్తి కళాకారులు పాల్గొన్నారు.

Similar News

News March 1, 2026

ఖమేనీ హతం.. పాలన ఎవరి చేతుల్లో అంటే?

image

ఇరాన్‌లో కొత్త నాయకుడిని నిర్ణయించే వరకు లీడర్‌షిప్ కౌన్సిల్ పాలన చూసుకుంటుందని ఆ దేశ మీడియా వెల్లడించింది. ఆ కౌన్సిల్‌లో ప్రెసిడెంట్, న్యాయాధిపతి, గార్డియన్ కౌన్సిల్‌లోని ఓ జ్యూరీ సభ్యుడు ఉంటారని తెలిపింది. సుప్రీం లీడర్ బాధ్యతలు ఈ కౌన్సిల్ తాత్కాలికంగా చూసుకుంటుందని పేర్కొంది. కాగా తదుపరి లీడర్ ఎవరో తనకు తెలుసని, కానీ ఇప్పుడే పేరు బయటపెట్టనని ట్రంప్ వ్యాఖ్యానించారు.

News March 1, 2026

ప.గో: డబ్బులు కొట్టేసేందుకు వచ్చిన ఫోన్ కాల్ ఇది..!

image

సైబర్ క్రైమ్ మోసగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తున్నారు. బురిడీ కొట్టించే ప్రయత్నంలో బెడిసి కొట్టిన ఉదంతం ఆకివీడు మండలంలో వెలుగు చూసింది. అజ్జమూరుకి చెందిన రిటైర్డ్ టీచర్‌కు నిన్న ఉదయం గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్‌కి సంబంధించి పత్రాలపై ష్యూరిటీ పెట్టిన సంగతి గుర్తులేదా అంటూ అతడ్ని భయపెట్టారు. ఆయన ధైర్యంగా ఎదుర్కొనే సరికి తోక ముడిచాడు. మళ్ళీ ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.

News March 1, 2026

హీరో విజయ్‌కు మరో షాక్..

image

తమిళ స్టార్ హీరో విజయ్‌కు వ్యక్తిగత జీవితంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. తన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన వేళ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఓ నటితో విజయ్‌కు అఫైర్ ఉందని తన తల్లి చేసిన ఆరోపణల్లో వాస్తవాలున్నాయని, అందుకే అన్‌ఫాలో చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా భార్య చేసిన ఆరోపణలపై విజయ్ ఇప్పటివరకూ స్పందించలేదు.