News December 24, 2025

కరీంనగర్: ఒకటో తరగతి విద్యార్థినిపై దారుణం

image

ఒకటో తరగతి బాలికపట్ల 8వ తరగతి బాలుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కరీంనగర్(D) చొప్పదండి మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చోటుచేసుకుంది. ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన పోలీసులు బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చోట వికృత చేష్టలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Similar News

News December 25, 2025

MBNR: విదేశాల్లో ఉన్నత విద్య.. అప్లై చేసుకోండి.!

image

ఉమ్మడి MBNR జిల్లా విద్యార్థులు విదేశాలలో అత్యున్నత విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ అభివృద్ధి అధికారిణి ఇందిర “Way2News” ప్రతినిధితో తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొందిన వారు వచ్చే ఈనెల 11లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు: సీపీ

image

విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో నగరవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ.. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. బహిరంగ మద్యపానం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.