News June 19, 2024

కరీంనగర్ ఒక ఎమోషన్: స్మిత సబర్వాల్

image

కరీంనగర్ జిల్లాలో గతంలో కలెక్టర్‌గా పనిచేసిన స్మిత సబర్వాల్‌కు ట్విటర్(X) వేదికగా ‘కరీంనగర్ స్మార్ట్ సిటీ అప్డేట్స్’ ప్రొఫైల్ నుంచి అడ్మిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీనిపై స్మిత సబర్వాల్ స్పందించారు. ‘Karimnagar is an emotion’ అంటూ రీట్వీట్ చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు అని రాసుకొచ్చారు.

Similar News

News January 21, 2025

సిరిసిల్ల: బిందెలో ఇరుక్కున్న ఓ చిన్నారి తల

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్‌లో ఓ చిన్నారి తల నీళ్ల బిందెలో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా బిందెలో నుంచి పాప తల బయటికి రాకపోవడంతో బిందెను జాగ్రత్తగా కత్తిరించి పాప తలను జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ఘటనలో పాపకు ఎలాంటి ప్రమాదం కాలేదు. ఇంత జరుగుతున్నా ఆ చిన్నారి ఏడవకుండా ధైర్యంతో ఉండడానికి చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

News January 21, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.90,177 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.37,948 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.44,260, అన్నదానం రూ.7,969,వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News January 21, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేపటినుండి గ్రామసభలు. @ మెట్పల్లి మండలంలో బాలిక అదృశ్యం.. కేసు నమోదు. @ భీమదేవరపల్లి మండలంలో గంజాయి సేవిస్తున్న నలుగురిపై కేసు. @ ముత్తారం మండలంలో ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో పోలీసుల తనిఖీలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య. @ గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్.