News December 27, 2025

కరీంనగర్ కమిషనరేట్లో తగ్గిన క్రైమ్ రేట్

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 16.84% క్రైమ్ రేట్ తగ్గినట్లు క్రైమ్ యాన్యువల్ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. 2024లో 7,361 కేసులు నమోదు కాగా.. 2025 సంవత్సరంలో 6421 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 80% పైగా కేసులు పరిష్కారమయ్యాయి. దీంతో కరీంనగర్లో పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా అమలవుతున్నట్టు స్పష్టమవుతుంది.

Similar News

News February 20, 2026

అమలాపురం: DRDA పీడీగా రాంబాబు బాధ్యతల స్వీకరణ

image

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(DRDA) ప్రాజెక్ట్ డైరెక్టర్(ఇన్‌ఛార్జ్)గా డి.రాంబాబు నియమితులయ్యారు. డ్వామా ఏపీడీగా ఉన్న ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం రాంబాబు శుక్రవారం కలెక్టర్ మహేశ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. నిబద్ధతతో గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

News February 20, 2026

గ్లోబల్ ఏఐ సెంటర్‌గా వైజాగ్: గూగుల్ సీఈవో

image

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విశాఖతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థిగా చెన్నై నుంచి ఐఐటీ-ఖరగ్‌పూర్ వెళ్లేటప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ మీదుగా ప్రయాణించేవాడినని, అప్పట్లో అది ఎంతో ప్రశాంతమైన నగరమని గుర్తుచేసుకున్నారు. అలాంటి విశాఖ నేడు గ్లోబల్ ఏఐ (AI) హబ్‌గా మారుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు. ఈ మార్పు అద్భుతమని ఆయన కొనియాడారు.

News February 20, 2026

వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాలి: హరీశ్ రావు

image

సిద్దిపేట 37వ వార్డులో BRS పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూ పాలనలో విఫలమైందని విమర్శించారు. గత బడ్జెట్‌లో గొప్పగా స్పీచ్‌లు ఇచ్చినా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కనీసం ఈసారైనా వాస్తవాలకు దగ్గరగా, ఆచరణాత్మకమైన బడ్జెట్‌ను రూపొందించాలని హరీశ్ సూచించారు.