News October 26, 2025
కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఇంకెన్నడు..?

కరీంనగర్ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్(కలెక్టరేట్) నాలుగేళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. అప్పటి BRS ప్రభుత్వం 2021 చివర్లో రూ.50కోట్ల వ్యయంతో కలెక్టరేట్ నిర్మాణం ప్రారంభించగా ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాదిలో పూర్తికావాల్సిన కలెక్టరేట్ భవనం నిధులలేమితో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాత కలెక్టరేట్ కూల్చివేయడంతో పలు శాఖలు ప్రైవేట్ కార్యాలయాల్లో నడుస్తున్నాయి.
Similar News
News October 26, 2025
రేపు భద్రాచాలం ఐటీడీఏలో ‘గిరిజన దర్బార్’

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ‘గిరిజన దర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి సమస్యలను లిఖితపూర్వకంగా అధికారులకు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో ఈ దర్బార్ జరుగుతుందని, అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆయన సూచించారు.
News October 26, 2025
మేడ్చల్: రేపు లక్కీగా వైన్స్ దక్కేదెవరికి?

రేపు శ్రీ పలనీ కన్వెన్షన్‌లో ఉ.11 గంటలకు మేడ్చల్-మల్కాజిగిరి యూనిట్లకు సంబంధించి నూతన మద్యం పాలసీ 2025-27కు డ్రా తీయడం జరుగుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మేడ్చల్ యూనిట్‌లోని 118, మల్కాజిగిరి యూనిట్‌లోని 88 మద్యం షాపులకు జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయడం జరుగుతుంది. దరఖాస్తుదారులు, అధికార ప్రతినిధులు తప్పని సరిగా హాజరుకావాలని సూచించారు. లక్కీ డ్రాలో టెండర్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
News October 26, 2025
31న మెదక్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్: DSP

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 31న మెదక్ పట్టణంలోని పీఎన్‌ఆర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇది ‘ఓపెన్ టు ఆల్’ టోర్నమెంట్ అని, 30న సాయంత్రం 5 గంటలలోగా ఆర్‌ఎస్‌ఐ నరేష్(87126 57954) వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.


