News November 1, 2025
కరీంనగర్: కవిత ‘జనం బాట.. అందుకేనా..?’

MLC కవిత జనం బాటతో జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ పెట్టేందుకు బాటలు వేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో తన బలాబలాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కరీంనగర్‌లో ఆమె పర్యటన సాగుతోంది. మేధావులను, రైతులను, కుల సంఘాలను, విద్యావంతులను కలుస్తూ తాను ఎత్తుకున్న BCనినాదంపై ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నారు. జిల్లాల పర్యటన తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి పార్టీ పెట్టాలా? వద్దా? అనే నిర్ణయానికి ఆమె వచ్చే ఛాన్స్ ఉంది.
Similar News
News November 1, 2025
డోన్ వద్ద బోల్తా పడ్డ MPDO వాహనం

పింఛన్ల పంపిణీ విధులను ముగించుకుని డోన్ వైపు వస్తుండగా చింతలపేట సమీపంలో ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి, ఏఈ నారాయణ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. శనివారం ఉదయం వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎంపీడీవో, ఏఈ నారాయణ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
News November 1, 2025
GWL: విద్యార్థులకు అస్వస్థత.. హాస్టల్ వార్డెన్ సస్పెండ్.!

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కారణంగా 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్ జయరాములును తక్షణమే <<18166938>>సస్పెండ్<<>> చేయాలని అధికారులను ఆదేశించారు. అస్వస్థత జరిగిన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడం, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
News November 1, 2025
MNCL: రేపు జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ ఎంపిక పోటీలు

మంచిర్యాల ZPHSబాలుర పాఠశాల మైదానంలో ఆదివారం జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ సీనియర్ పురుషులు, మహిళల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం సెక్రటరీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధ్రువపత్రాలతో రేపు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.


