News February 19, 2025
కరీంనగర్: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

ఉమ్మడి KNR, ADB, NZB, MDK పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.
Similar News
News November 13, 2025
సముద్రతీరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నిజాంపట్నం మండలం దిండి పంచాయతీలోని పరిశవారిపాలెం సముద్ర తీరం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం సముద్ర తీరంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించామన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 13, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో గురువారం సీసీఐ పత్తి ధర క్వింటాలు రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,800గా నిర్ణయించారు. బుధవారం ధరతో పోలిస్తే గురువారం సీసీఐ ధరలో మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు. ప్రైవేటు ధర రూ.50 పెరిగినట్లు వెల్లడించారు.
News November 13, 2025
ప్రేమించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు

తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం రాత్రి కొత్తపల్లి SI జయశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. పాములపాడు(M) తుమ్మలూరుకు చెందిన సూర్య, కొత్తపల్లికి చెందిన ఓ యువతి ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంటానని సూర్య తనను శారీరకంగా వాడుకుని ఇప్పుడు మాట మార్చాడని పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


