News November 16, 2024
కరీంనగర్: కాంగ్రెస్ టికెట్ ఎవరికో?

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఉపఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిల పేర్లను అధిష్ఠానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలున్నాయి.
Similar News
News December 20, 2025
విద్యార్థులందరికీ దంత పరీక్షలు: కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులెవరూ దంత సమస్యలతో బాధపడకూడదని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ ప్రధాన ఆస్పత్రిలో విద్యార్థుల చికిత్స తీరును ఆమె పరిశీలించారు. ఇప్పటివరకు 12 వేల మందికి పరీక్షలు నిర్వహించి, 1500 మంది బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 23లోగా తొలి విడత పూర్తి చేసి, జనవరి 1 నుండి రెండో విడత శిబిరాలు ప్రారంభించాలని వైద్యులకు సూచించారు.
News December 20, 2025
కరీంనగర్: జూనియర్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ బాలుర మైనారిటీ గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న 1 గణితం జూనియర్ లెక్చరర్ పోస్టుకు ఔట్ సోర్సింగ్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి మ్యాథ్స్ లో పీజీ చేసి 50 శాతం మార్కులుండి బీ.ఎడ్ చేసిన వారు అర్హులని, ధరఖాస్తులు ఈ నెల 29 వరకు కరీంనగర్ మైనారీటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 08782957085 లో సంప్రదించగలరు.
News December 20, 2025
కరీంనగర్ డీసీసీబీ పర్సన్ ఇంచార్జీగా జిల్లా కలెక్టర్

కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (DCCB)కు పర్సన్ ఇంచార్జిగా జిల్లా కలెక్టర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సహకార శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవడం, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు నేపథ్యంలో, సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.


