News September 13, 2025
కరీంనగర్: కానరాని బొడ్డెమ్మ పండుగ..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే బొడ్డెమ్మ వేడుక కనుమరుగయిపోయింది. కాగా, భాద్రపద బహుళ పంచమి నుంచి ఈ బొడ్డెమ్మ పండుగ మొదలవుతుంది. గ్రామాల్లో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో బొడ్డెమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం పట్టణాల్లో అక్కడక్కడ కనిపిస్తున్న బొడ్డెమ్మ వేడుకలు గ్రామాల్లో మాత్రం కనిపించడం లేదు.
Similar News
News September 13, 2025
శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా మధురై(MDU), బరౌని(BJU) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబర్ 06059 MDU- BJU ట్రైన్‌ను SEPT 17- NOV 26 వరకు ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. నం.06060 BJU- MDU ట్రైన్‌ను SEPT 20-NOV 29 వరకు ప్రతి శనివారం సేవలు అందిస్తుందన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News September 13, 2025
హైదరాబాద్ చుట్టూ మూడు రైల్వే టెర్మినల్స్

హైదరాబాద్ చుట్టూ కొత్తగా మూడు రైల్వే టెర్మినల్స్‌ను నిర్మించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఈ టెర్మినల్స్ నిర్మాణం చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించింది. ఈ వివరాలను రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. రైల్వే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
News September 13, 2025
KNR: నేను చేయగలనా కాదు.. నేను చేస్తాను..!

పాజిటివ్ థింకింగ్.. మనిషికి ఉండాల్సిన మంచి లక్షణాల్లో ఇదోటి. ఈ గుణం ఉంటే చాలు ఎలాంటి సమస్యనైనా సునాయాసంగా ఎదిరించవచ్చని సూచిస్తున్నారు సైకాలజిస్టులు. ప్రస్తుత ప్రపంచంలో మనమెంత మంచిపని చేసినా దాంట్లో తప్పును వెతికేవారే ఎక్కువయ్యారు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మేలంటున్నారు మానసిక నిపుణులు. నిత్యం సానుకూల ఆలోచనలతో ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యుషన్ ఉంటుందంటున్నారు. # నేడు పాజిటివ్ థింకింగ్ డే.