News January 31, 2026

కరీంనగర్ కార్పొరేషన్‌లో త్రిముఖ పోటీ తప్పదా..!

image

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 1257 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. అందులో బీఆర్ఎస్ అభ్యర్థులు 374, బీజేపీ అభ్యర్థులు 309, కాంగ్రెస్ నుంచి 252 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి సైతం 55 మంది దరఖాస్తులు చేయగా వైసీపీ నుంచి పోటీలో ఎవరు నిలవలేదు. 93 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు.

Similar News

News February 14, 2026

KNR: కాంగ్రెస్ నేతపై దాడి.. కేసు నమోదు

image

కరీంనగర్ రాజకీయ కక్షలతో కాంగ్రెస్ నాయకుడు శ్యాంసుందర్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కార్పొరేటర్ భూమయ్య భార్యకు మద్దతుగా ప్రచారం చేశారనే కోపంతో, మాజీ కార్పొరేటర్ సోదరుడు జంగిలి సతీశ్‌తో పాటు మరికొందరు ఆయనపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.

News February 14, 2026

కరీంనగర్ పీఠంపై ‘క్యాంపు’ రాజకీయం

image

కరీంనగర్ నగర పాలక సంస్థలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. 30 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, మరో ఇద్దరిని చేర్చుకొని బలాన్ని 32కు పెంచుకుంది. పీఠం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్‌బీ పార్టీలు ఏకమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు చేజారకుండా ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

News February 14, 2026

JMKT: ఒకరికి సున్నా.. ఆరుగురికి ఒక్కటే ఓటు!

image

జమ్మికుంట మున్సిపాలిటీలో కొందరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు చూస్తుంటే.. కనీసం వారి ఇంట్లోని వారు కూడా వారికి ఓటు వేయలేదా? అన్న సందేహం కలుగుతోంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 6వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థికి సున్నా ఓట్లు వచ్చాయి. అంటే ఆమెకు సొంత ఓటు కూడా పడకపోవడం గమనార్హం. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఇద్దరు జనసేన అభ్యర్థులకు ఒకే ఒక ఓటు రావడం స్థానికంగా చర్చకు దారితీసింది.