News February 16, 2025

కరీంనగర్: ‘కేసీఆర్‌కు పట్టిన గతే సీఎంకు పడుతుంది’

image

ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలన్నారు. లేకపోతే మాజీ సీఎంలు కేసీఆర్‌, కేజ్రీవాల్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Similar News

News November 7, 2025

జగిత్యాల: జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతరం

image

అఖండ భారతావనికి స్వాతంత్ర్య కాంక్షను కలిగించిన జాతీయ గేయం వందేమాతరానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతరం సామూహిక గేయ ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీఖాన్, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ సైదులు, వేణు, పోలీస్ అధికారులు, తదితర సిబ్బంది పాల్గొని వందేమాతరం గేయాన్ని ఆలపించారు.

News November 7, 2025

ఈనెల 12న RUకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక: వీసీ

image

ఈ నెల 12న రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 4వ కాన్వకేషన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ వెంకట బసవరావు వెల్లడించారు. శుక్రవారం యూనివర్సిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలో 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది స్కాలర్లకు కాన్వకేషన్ పట్టాలు, 18,396 మందికి ఓడీ ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు.

News November 7, 2025

HYD: ఎన్నికల సమయంలో సోదాలు సహజం: పొన్నం

image

ఎన్నికల సమయంలో సోదాలు జరగడం సహజమని, అవి ఎవరి ఇంట్లో అయినా చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల సంఘం పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు సోదాలు నిర్వహించడం ఎన్నికల సంఘం హక్కని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని మంత్రి స్పష్టం చేశారు.