News March 20, 2024

కరీంనగర్: గుండెపోటుతో ఏఎస్సై మృతి

image

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మార్కొండ కిషన్(59) బుధవారం జ్యోతినగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. కిషన్ పోలీస్ శాఖలో సుధీర్ఘ కాలం పాటు సేవలందించారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలు వారి స్వగ్రామమైన తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో జరగనున్నాయి.

Similar News

News September 5, 2025

KNR: ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

image

KNR జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు EVM, వీవీ ప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. EVMల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

News September 5, 2025

జాతీయస్థాయి పోటీలకు చొప్పదండి నవోదయ విద్యార్థులు

image

ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి కళా ఉత్సవ్- 2025 పోటీలకు చొప్పదండి జవహర్ నవోదయ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. గురునాథం వంశీ(10వ తరగతి), ఎం.కార్తికేయ(9వ తరగతి) ఈనెల 2, 3 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, ఒంగోలు నవోదయ విద్యాలయంలో నిర్వహించిన రీజనల్ లెవెల్ కళా ఉత్సవ్- 2025 పోటీల్లో పాల్గొన్నారు. అక్కడ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను ప్రిన్సిపల్ బ్రహ్మానంద రెడ్డి అభినందించారు.

News September 5, 2025

KNR: పిల్లలకు పాఠాలు చెప్పిన కలెక్టరమ్మ

image

రామడుగు మండలం దేశరాజుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అన్ని తరగతి గదులను పరిశీలించారు. ఏడో తరగతిలో మ్యాథ్స్ పాఠం వింటున్న విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా పిల్లలకు బోధించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మెళకువలతో విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయురాలికి కలెక్టర్ సూచించారు.