News October 7, 2024

కరీంనగర్: గునుగు పూలకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

image

కరీంనగర్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన గుంటుక కాళిదాసు ఆదివారం ఉదయం గునుగు పూలు తేవడానికి వెళ్లాడు. పూలను కోసే క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు.

Similar News

News February 24, 2026

KNR: ఆన్‌లైన్ హాల్ టికెట్‌తో అనుమతి

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్‌లైన్ హాల్ టికెట్‌తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.

News February 23, 2026

కరీంనగర్ పోలీస్ దళంలోకి రెండు కొత్త డాగ్స్

image

నేర పరిశోధనను మరింత వేగవంతం చేసేందుకు కరీంనగర్ కమిషనరేట్ పోలీస్ దళంలోకి రెండు నూతన పోలీస్ డాగ్స్ చేరాయి. HYD లోని ఐ.ఐ.టి.ఏ (IITA) కేంద్రంలో 9 నెలల పాటు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న రోలెక్స్ (ట్రాకర్), మాక్స్ (స్నిఫర్) పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశాయి. వీటి రాకతో జిల్లాలో భద్రత వ్యవస్థ మరింత మెరుగుపడుతుందన్నారు.

News February 23, 2026

కరీంనగర్ పోలీస్ డాగ్ ‘టైసన్’కు స్వర్ణ పతకం

image

కరీంనగర్ పోలీస్ విభాగానికి చెందిన పోలీస్ డాగ్ ‘టైసన్’ రాష్ట్ర స్థాయిలో ఘనత చాటింది. హైదరాబాద్ మొయినాబాద్‌లోని ఐ.ఐ.టి.ఏ (IITA) శిక్షణ కేంద్రంలో జరిగిన 24వ బ్యాచ్ ముగింపు వేడుకల్లో ఎక్స్‌ప్లోజివ్ (పేలుడు పదార్థాల గుర్తింపు) విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా టైసన్‌ను, దాని హ్యాండ్లర్ పి.సి. ఇ. రాజును పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.