News March 6, 2025

కరీంనగర్: గెలిచినోళ్ల సంబరాలు.. ఓడినోళ్ల సమాలోచనలు

image

KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీలు నేతలంటున్నారు.

Similar News

News September 16, 2025

గుంటూరు: నేడు కోడెల వర్ధంతి

image

ప్రముఖ రాజకీయ నాయకుడు, నవ్యాంధ్ర తొలి సభాపతి, పల్నాటి పులిగా పేరుపొందిన కోడెల శివప్రసాదరావు 1947 మే 2న ఉమ్మడి గుంటూరు జిల్లా కండ్లగుంటలో జన్మించారు. డాక్టర్‌గా పని చేస్తూనే 1983లో టీడీపీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరసగా 5సార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. ఆయన పలు శాఖల మంత్రిగా పనిచేశారు. 2014లో గెలిచి నవ్యాంధ్ర తొలి శాసన సభాపతి అయ్యారు. 2019 సెప్టెంబరు 16న హైదరాబాదులో ఆయన స్వగృహంలో మరణించారు.

News September 16, 2025

మెదక్-సిద్దిపేట మార్గంలో రాకపోకలు పునరుద్ధరణ

image

మెదక్-సిద్దిపేట రహదారిపై నందిగామ వద్ద వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో గత 20 రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. కల్వర్టు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం సిద్ధం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 16, 2025

పరిటాల శ్రీరామ్‌కు 2+2 భద్రత

image

ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమయన్వయకర్త పరిటాల శ్రీరామ్‌కు భద్రత పెరగనుంది. 2+2 భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైసీపీ హయాంలో తన భద్రతను 1+1కు తగ్గించారని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీరామ్ తరఫున లాయర్ గోళ్ల శేషాద్రి వాదనలు వినిపించగా కోర్టు ఏకీభవించింది. భద్రత పెంచాలని తీర్పు వెలువరించింది.