News March 6, 2025

కరీంనగర్: గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్న అంజిరెడ్డి

image

ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. గెలిచిన BJP అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి కరీంనగర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హాల్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

Similar News

News November 9, 2025

వరంగల్: పొన్నం జీ.. జర దేఖో జీ..!

image

రవాణా శాఖలో ప్రతి పనికో రేటు ఉంటుంది. అది చెల్లిస్తేనే మన పని అవుతుందన్న నిజం ప్రతి వాహనదారుడికి, లైసెన్సుదారుడికి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల లంచం రేట్లు పెరిగాయి. ఎన్ని ఆన్‌లైన్లో నమోదు చేసినా చివరికి పెన్సిల్ టిక్ పడితేనే RTAలో మనపని జరుగుతుందని అందరికీ తెలిసినా, ACBకి ఎందుకు తెలియట్లేదో అర్థం కావట్లేదు. నిత్యం ఏజెంట్లు, అధికారులకు బహిరంగంగా ముడుపులు ఇస్తున్నా వాళ్లు దొరకట్లేదు.

News November 9, 2025

కడప: వివాదంగా మారిన టీచర్లు టూర్

image

మైదుకూరు మండలం నంద్యాలం పేట కాంప్లెక్స్ పరిధిలోని 20మంది టీచర్లు ఒకేసారి సెలవు పెట్టి టూర్‌కు వెళ్లారు. ఒకే టీచర్ ఉన్న స్కూళ్ల నుంచి సైతం సెలవు పెట్టడం వివాదాస్పదమైంది. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెండో శనివారం లీవ్ ఉంటుందని టీచర్లు ముందుగానే టూర్ ప్లాన్ చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆ లీవ్ రద్దు చేశారు. టూర్ క్యాన్సిల్ చేసుకోలేక అందరూ వెళ్లారు.

News November 9, 2025

సీఎం చేతికి తిరువూరు నివేదిక.. చంద్రబాబు ఏమన్నారంటే..!

image

విజయవాడ ఎంపీ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ల వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సీఎం చంద్రబాబుకు నివేదిక, పెన్ డ్రైవ్‌ను అందించారు. నేతలు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. ఈ పంచాయితీపై తన వద్ద కూడా సమగ్ర నివేదిక ఉందని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. త్వరలో ఇద్దరు నేతలను పిలిపించి మాట్లాడతానని ఆయన వెల్లడించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.