News February 27, 2025

కరీంనగర్: గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నమోదైన వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు గురువారం కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉదయం 08.00 గంటల నుంచి 12.00 గంటల వరకు 18.88 శాతం నమోదు అయింది. అలాగే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం ఉదయం 08.00 గంటల నుంచి 12.00 గంటల వరకు 34.98 శాతం నమోదు అయింది.

Similar News

News February 27, 2025

ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్

image

కరీంనగర్‌ ముకరంపూర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ స్టేషన్‌లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యూ లైన్‌లో వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News February 27, 2025

కరీంనగర్‌: ఓటు వేయడానికి ఆమె డల్లాస్ నుంచి వచ్చింది

image

శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం కరీంనగర్‌లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు దూర్షెడ్ గ్రామానికి చెందిన శ్రీరామోజు అఖిల డల్లాస్ నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి బాధ్యత అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ఆమె తెలిపారు.

News February 27, 2025

కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల అప్డేట్

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటింగ్ 34.61% శాతం, ఉపాధ్యాయుల ఓటింగ్ 58.35% నమోదైనట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

error: Content is protected !!