News December 22, 2025
కరీంనగర్: గ్రామపాలకులు ఈ ‘మహాలక్ష్ములు’..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలు సాగుతున్నాయి. చాలాచోట్ల మహిళలు అభ్యర్థులుగా నిలిచి విజయం సాధించారు. నేడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వీరంతా ‘మహాలక్ష్ములు’గా పట్టుచీరలు కట్టుకుని ఆయా జీపీలకు వచ్చారు. వీరితో స్పెషల్ ఆఫీసర్లు ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. కాగా, తమ గ్రామాలను సాక్షాత్తు అమ్మవారు లక్ష్మిదేవీనే ఏలబోతోందంటూ గ్రామస్థులు సంబర పడుతున్నారు.
Similar News
News December 25, 2025
అనకాపల్లి: ‘త్వరితగతిన విద్యా రుణాలు మంజూరు చేయాలి’

తల్లిదండ్రుల సివిల్ స్కోర్ చూడకుండా విద్యార్థులకు విద్యా రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో బ్యాంకు రుణాలు మంజూరుపై సమీక్ష నిర్వహించారు. కౌలు రైతులకు, పీఎం సూర్య ఘర్ పథకానికి పరిశ్రమలు, డెయిరీ, స్వయం సహాయక బృందాలకు రుణాలు అందజేయాలన్నారు. లక్ష్యానికి మించి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలన్నారు.
News December 25, 2025
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్

సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘థాయ్ కిళవి’ సినిమా కోసం పూర్తిస్థాయి గ్రామీణ వృద్ధురాలి పాత్రలో ఒదిగిపోయారు. మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తూ ‘ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో’ అంటూ ఆమె పాత్ర గురించి చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది.
News December 25, 2025
ATP: మహిళను నమ్మించి మోసం చేశారు!

ఉరవకొండ మం. నింబగల్లులో బంగారు నగలకు మెరుగు పెడతామని నమ్మించి స్వరూప అనే మహిళ వద్ద 2 తులాల గొలుసును దుండగులు అపహరించారు. ఇద్దరు వ్యక్తులు ఇత్తడి సామాన్లతో పాటు గొలుసును శుభ్రం చేస్తామని నమ్మించారు. గిన్నెలో ఆమె గొలుసు వేసి చాకచక్యంగా చోరీ చేశారు. అనుమానం రాకుండా నీటిపై పలు రంగులు వేసి ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టమని అక్కడి నుంచి ఉడాయించారు. తర్వాత గిన్నెను పరిశీలించిన గొలుసు లేకపోవడంతో కంగుతింది.


