News December 31, 2025

కరీంనగర్: గ్రామానికో మహిళా సంఘం భవనం..!

image

మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామైక్య సంఘాల బలోపేతానికి గ్రామానికో భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో ఉమ్మడి KNRలో 132 భవనాలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ భవనాల నిర్మాణాలకు గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఉపాధి హామీ నిధులతో భవనాల నిర్మాణాలు చేపట్టనున్నారు. 2 గుంటల స్థలంలో 600 ఫీట్లతో రూ.10 లక్షలతో వీటిని కట్టనున్నారు.

Similar News

News February 14, 2026

రోజూ 6-7 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

image

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 6 నుంచి 7 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 నుంచి 6 కేజీల ఎండుగడ్డి, 3 నుంచి 3.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 15-20 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.

News February 14, 2026

PGIMERలో 59పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>ఛండీగఢ్‌లో<<>>ని పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్‌లో 59 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, సంబంధిత డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గ్రూప్ ఏ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ బీ, సీ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://pgimer.edu.in/

News February 14, 2026

శివరాత్రి: రేపు ఉపవాసం ఎవరు ఉండాలి?

image

మనస్సును అదుపులో ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే ఆరోగ్యవంతులైన భక్తులందరూ శివరాత్రి నాడు ఉపవాసం ఉండవచ్చు. మోక్షం కోరేవారు, పాప ప్రక్షాళన కావాలనుకునేవారు, శివకృపకై పరితపించేవారు రేపు ఉపవాసం ఉండాలని పండితుల సూచన. ‘రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేస్తే ఆత్మశుద్ధి జరుగుతుంది. మనోబలం పెరిగి ఈశ్వరుని అనుగ్రహంతో తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి’ అంటున్నారు.