News February 1, 2025
కరీంనగర్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్

కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్‌లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.
Similar News
News February 16, 2026
సంచలనం.. మెట్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా లింబాద్రి

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపాలిటీలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. 26 వార్డులు గల మున్సిపాలిటీలో 6 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. స్వతంత్ర కౌన్సిలర్లు నలుగురు, బీజేపీకి చెందిన ఒక సభ్యుడు మద్దతు తెలపడంతో కాంగ్రెస్ అభ్యర్థి మైలారపు లింబాద్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా ఓంకారి నవీన్ ఎన్నికయ్యారు.
News February 16, 2026
10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. అనంతపురం డివిజన్‌లో 46, హిందూపురం డివిజన్‌లో 31 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470
News February 16, 2026
ఐఐటీ గువాహటిలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు

<


