News March 5, 2025
కరీంనగర్: చెల్లని ఓట్లు 28,686

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలలో మొత్తం 2,52,029 మంది ఓటు వేయగా అందులో 2,23,343 ఓట్లు చెల్లుబాటు కాగా 28,686 ఓట్లు చెల్లుబాటు కానట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. 1,11,672 ఓట్లను కోటా నిర్ధారణ ఓట్లుగా నిర్ణయించారు. కాగా తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యత లభించింది.
Similar News
News December 22, 2025
నెల్లూరు: ఇద్దరు బీటెక్ యువకుల మృతి

నెల్లూరు రూరల్ కొత్త LNTకి చెందిన యుగంధర్ రెడ్డి(21) గూడూరు నారాయణ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీనివాససత్రం బీచ్‌కు వెళ్లాడు. అలల తాకిడికి యుగంధర్ రెడ్డి కొట్టుకెళ్లి చనిపోయాడు. అలాగే నెల్లూరు సిటీకి చెందిన హర్షసాయి(19) ఒంగోలులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కొత్తపట్నం బీచ్‌కు వెళ్లాడు. అలల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి హర్షసాయి వెళ్లి చనిపోయాడు.
News December 22, 2025
కడప జిల్లా వైసీపీలో వర్గపోరు?

కడప జిల్లా వైసీపీలో వర్గపోరు కనిపిస్తోంది. నిన్న YS జగన్ పుట్టినరోజు వేడుకల్లో కూడా నేతలు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ఈ చర్చకు తావిస్తోంది. జమ్మలమడుగులో ఓ నేత ఏర్పాటు చేసిన విందులో ముందుగా రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. అప్పుడు అక్కడే ఉన్న సుధీర్ రెడ్డి… ఆయన వెళ్లాక అక్కడికి వెళ్లారు. ఇక బద్వేల్‌లో కూడా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, విశ్వనాథరెడ్డిలు కూడా వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించారు.
News December 22, 2025
HYDలో పెరుగుతున్న కేసులు.. జర భద్రం!

వర్షాకాలంలో భయపెట్టే డెంగ్యూ ఈసారి చలికాలంలోనూ వణుకు పుట్టిస్తోంది. DEC నెలలోనూ డెంగ్యూ కేసులు పెరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. 10రోజుల్లో నగరంలో 4పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క NOVలోనే 90కిపైగా డెంగ్యూ, వైరల్ జ్వరాల కేసులు ఫీవర్ ఆస్పత్రికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలన్నారు. దోమల నివారణకు అధికారుల చర్యలేవని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


