News July 5, 2024

కరీంనగర్: జలపాతం వద్ద తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్‌కు చెందిన సంపత్, మన్నెంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గురువారం జలపాతాన్ని చూసేందుకు వెళ్లగా.. తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పృహ తప్పి పడిపోయారు. వారికి గాయాలు కావడంతో గ్రామస్థులు 108 ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News July 8, 2024

జగిత్యాల: నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో 5 నెలల చిన్నారికి చోటు

image

జగిత్యాల జిల్లాకు చెందిన ఓ 5నెలల చిన్నారి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. కథలాపూర్ మండలానికి చెందిన మహేందర్-మౌనికల కూతురు ఐర(5నెలలు). అయితే ఐరాకు 2 నెలల వయసు నుంచే పలు రకాల వస్తువులు, బొమ్మలు, కార్డులను చూపించి గుర్తుపట్టేలా తండ్రి తీర్ఫీదు ఇచ్చాడు. ఇటీవల ఐరా 135 రకాల ఫ్లాష్ కార్డులను గుర్తు పట్టిన వీడియోను నోబెల్ సంస్థకు ఆన్‌లైన్‌లో పంపడంతో.. ధ్రువపత్రం, మెడల్‌ను పంపారు.

News July 8, 2024

BREAKING.. జగిత్యాల జిల్లాలో హత్య

image

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలో భార్యను చంపి భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉపాధికోసం బహ్రెయిన్ వెళ్లి ఆదివారం ఇంటికి వచ్చిన భర్త లింగం.. అనుమానంతోనే భార్యను తలపై కొట్టి చంపేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2024

JMKT: నేటి నుంచి యథావిధిగా ప్యాసింజర్ రైళ్లు

image

అసిఫాబాద్ రోడ్ నుంచి రేచిని రోడ్ మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల వల్ల తాత్కాలికంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లను నేటి నుంచి యథావిధిగా నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. 12757/58 కాగజ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12733/34 భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, 17033/34 సింగరేణి ప్యాసింజర్ రైలు,17003/04 రామగిరి, 07765/66 కరీంనగర్ పుష్‌పుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.