News December 29, 2025
కరీంనగర్: జిల్లాకు ఒకటి చొప్పున క్రిటికల్ కేర్ సెంటర్..!

ప్రైవేట్ దోపిడీ కట్టడి, కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో సర్కార్ దవాఖానాల్లో ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. మెయిన్ ఆస్పత్రులకు సంబంధం లేకుండా స్వయంప్రతిపత్తితో ఇవి నడుస్తాయి. 50 పడకల ఆస్పత్రుల్లో 10 ICU, 6 హైడిపెండెన్స్ యూనిట్, 4 ఎమర్జెన్సీ బెడ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే KNRలో ప్రారంభమై GDK, JGTLలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.SRCLలో పనులు సాగుతున్నాయి.
Similar News
News December 30, 2025
కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.1,15,42,056

కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. స్వామివారికి 49 రోజుల్లో రూ.1,15,42,056 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.వెంకటేశ్ తెలిపారు. 60 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి, 50విదేశీ నోట్లు వచ్చాయన్నారు. ఈకార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ అర్చకులు, సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News December 30, 2025
సంగారెడ్డి జిల్లా రైతులకు కలెక్టర్ ముఖ్య గమనిక

సంగారెడ్డి జిల్లాలో 4,766 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సహకార సంఘాల వద్ద 444 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 3,819 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో పూర్తి స్థాయి యూరియా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
News December 30, 2025
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ స్కోర్ ఎంతంటే?

శ్రీలంక ఉమెన్స్ టీమ్‌తో జరుగుతున్న 5వ టీ20లో భారత్ 175/7 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 77 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 43 బంతుల్లో 68 రన్స్ చేసి ఆదుకున్నారు. చివర్లో అరుంధతీ రెడ్డి బౌండరీలతో చెలరేగారు. ఆమె 11 బంతుల్లో 27* రన్స్‌తో రాణించారు.


