News March 26, 2025

కరీంనగర్: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

image

మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీనిపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు అమాత్య యోగం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధర్ బాబు, పొన్నం కేబినెట్లో ఉన్నారు.

Similar News

News November 4, 2025

MBNR: U-14, 17 కరాటే.. నేడు ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-14, 17 విభాగంలో కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్సీఎఫ్ కార్యదర్శి Dr.ఆర్.శారదాబాయి Way2Newsతో తెలిపారు. నవంబర్ 4న మహబూబ్‌నగర్‌లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్‌లో ఎంపికలు నిర్వహిస్తామని, అండర్-14 విభాగంలో 1.1.2012లో, అండర్-17 విభాగంలో 1.1.2009 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని, ఆసక్తిగల బాల, బాలికలు పీడీ నరసింహను (94928 94606) సంప్రదించాలన్నారు.

News November 4, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,12,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3000 తగ్గి రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 4, 2025

కాకినాడ రూరల్‌లో వాళ్లదే సెటిల్మెంట్ల హవా!

image

కాకినాడ రూరల్‌‌లో కొందరు నాయకులు సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరపలో ఓ నాయకుడు ‘ఛైర్మన్’ పేరుతో పేకాట శిబిరాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పోలీస్‌, రెవెన్యూ విభాగాలను ఇతరులకు అప్పగించారని, లేఔట్లు, సెటిల్‌మెంట్లు ఎమ్మెల్యే బంధువు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. గతంలో పవన్‌ కళ్యాణ్ ఎమ్మెల్యేను పిలిచి మందలించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలసిందే.