News November 5, 2024

కరీంనగర్ జిల్లాలోని 108 అంబులెన్స్‌లో ఉద్యోగ అవకాశాలు

image

KNR జిల్లాలోని వివిధ మండలాల108 అంబులెన్సులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా పనిచేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మేనేజర్ ఇమ్రాన్ తెలిపారు. అర్హత: BSC-BZC, BSC-NURS, ANM, GNM, B-PM, M-PM లేదా ఇంటర్ తర్వాత ఏదైనా మెడికల్ డిప్లమా ఉండాలని, 25-30లోపు వయసు ఉండాలన్నారు. ఈనెల 6న ఉదయం 10 నుంచి 4లోపు, జిల్లా ఆస్పత్రిలోని 108 ఆఫీసులో ఒరిజినల్, ఒక సెట్టు జిరాక్స్‌తో రావాలన్నారు.

Similar News

News February 26, 2026

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రా

image

కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న పమేలా సత్పతిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం, కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రాను నియమించారు. ప్రస్తుతం ఆమె ITDA ఏటూరునాగారంలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టర్ చిత్ర మిశ్రా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

News February 25, 2026

KNR: ‘మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి’

image

అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం ద్వారా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిర్మూలన చట్టం – 2013 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో లోకల్ కమిటీ మెంబర్ రాజా రెడ్డి ఈ చట్టంపై అవగాహన కల్పించారు. పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం ఈ చట్టం ఎంత ముఖ్యమో వివరించారు.

News February 25, 2026

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో నగరంలోని పలు కేంద్రాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘాను పరిశీలించిన ఆయన, ప్రతి కేంద్రం వద్ద స్టాటిక్ ఫోర్స్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.