News July 7, 2025
కరీంనగర్ జిల్లాలో ఉన్నత స్థానాల్లో మల్యాల వాసులు

మల్యాలకు చెందిన ఇరువురు వ్యక్తులు ఉన్నత స్థాయి ఉద్యోగాలతో కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. మల్యాలకు చెందిన వాసాల సతీష్ కుమార్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో అసిస్టెంట్ కమిషనర్‌గా, అలాగే సీనియర్ న్యాయవాది మల్యాల ప్రతాప్ కరీంనగర్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన వీరిరువురు ఉన్నత స్థానాల్లో ఉండడం పట్ల మల్యాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News July 7, 2025
HYD: T WORKS వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్.!

HYD నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు నెటిజన్లు X వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. T WORKS వద్ద రోడ్డు డిజైన్ సైతం సరిగా లేదని, యూటర్న్ సమీపంలోనే ఐలాండ్ నిర్మించడం కారణంగా ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుందని తెలిపారు. రోడ్డు ఇరుకుగా మారడానికి డిజైన్లు సైతం కారణంగా పలువురు ఆరోపిస్తున్నారు.

సిరిసిల్ల: జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

సిరిసిల్ల జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రంగి 3.2, చందుర్తి 14.6, వేములవాడ రూరల్ 17.6, బోయినపల్లి 17.6, వేములవాడ 9.4, సిరిసిల్ల 18.1, కోనరావుపేట 12.3, వీర్నపల్లి 9.3, ఎల్లారెడ్డిపేట 27.7, గంభీరావుపేట 20.4, ముస్తాబాద్ 21.2, తంగళ్ళపల్లి 39, ఇల్లంతకుంట 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మొత్తం జిల్లాలో ఆవరేజ్ గా 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.