News March 8, 2025
కరీంనగర్ జిల్లాలో కీలక స్థానాల్లో మహిళ మణులు

రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిచే కరీంనగర్ జిల్లాలో మహిళ నేతలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. రామడుగుకు చెందిన నేరెళ్ల శారద రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి, BJP జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీలతో పాటు నార్కోటిక్స్ వింగ్ ACP మాధవి, CI శ్రీలత తదితరులు మహిళలోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Similar News
News March 2, 2026
KNR: ‘ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు’

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో ఉంచొద్దని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 345 దరఖాస్తులు వచ్చాయి.
News March 1, 2026
KNR: ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్షకు 311 మంది హాజరు

కరీంనగర్ లోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్షకు 311 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎం.నాగైలేశ్వర్ తెలిపారు. ఫలితాలను హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారని, ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామన్నారు. ఇతర వివరాలకు ఎస్సీ స్టడీ సర్కిల్లో సంప్రదించాలన్నారు.
News March 1, 2026
ఘనంగా నిర్వహించిన వెటర్నరీ డాక్టర్స్ స్పోర్ట్స్ మీట్

కరీంనగర్లోని తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ జిల్లా వెటర్నరీ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ రీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో పాల్గొనడం సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. TNGO ప్రెసిడెంట్ దారం శ్రీనివాస్ రెడ్డి, JAC కన్వీనర్ TGO ప్రెసిడెంట్ మడిపల్లి కాళిచరణ్, టీన్జీవో సెక్రటరీ లక్ష్మణ్ రావు, కార్యదర్శి అరవింద్ రెడ్డి ఉన్నారు.


