News March 12, 2026
కరీంనగర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

కరీంనగర్(D)లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలన్నారు. సింగిల్ సిలిండర్‌కు 25 రోజులు, డబుల్‌కు 15 రోజుల గడువు ఉంటుందని తెలిపారు. గ్యాస్ పొందే సమయంలో ఓటీపీ తప్పనిసరిగా చెప్పాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. కరీంనగర్‌కు 7వ ర్యాంకు

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 14943 మంది పరీక్షలు రాయగా 11961 మంది పాసై 80.04 శాతంతో స్టేట్‌లోనే 7వ ర్యాంకు వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1320 మందికి 876 మంది పాసై 66.36 శాతంతో 30వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1837 మందికి 591 మంది పాసై 32.17%తో 16వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 163 మందికి 71 మంది పాసై 43.56%తో 28th ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. కరీంనగర్‌కు 6వ ర్యాంకు

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 16726 మంది పరీక్ష రాయగా 11737 మంది పాసై 70.17 శాతంతో స్టేట్‌లోనే 6వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1,449 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 822 మంది విద్యార్థులు పాసై 56.73 శాతంతో స్టేట్‌లో 24వ స్థానంలో నిలిచింది.
News April 12, 2026
KNR: మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహేష్

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో కరీంనగర్‌కు చెందిన మేడి మహేష్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తనపై నమ్మకంతో నియమించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని మహేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


