News February 13, 2025

కరీంనగర్ జిల్లాలో MURDER.. ఇద్దరికి జీవిత ఖైదు

image

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన కేసులో జిల్లా సెషన్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కేశవపట్నం ఎస్ఐ కొత్తపల్లి రవి తెలిపారు. 2020 డిసెంబర్ 10న జరిగిన దాడిలో మెట్టుపల్లికి చెందిన రాచమల్ల సంపత్‌ను అదే గ్రామానికి చెందిన బోనగిరి జంపయ్య, బోనగిరి ఓదెలు దాడి చేసి చంపిన కేసులో వీరు ఇరువురికి రూ.2,500 జరిమానాతో పాటు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.

Similar News

News February 14, 2025

రిటర్నింగ్ అధికారుల విధులు చాలా కీలకం: డీపీవో

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఆర్వో, సహాయ రిటర్నింగ్ అధికారుల విధులు చాలా కీలకమని జిల్లా పంచాయతి అధికారి నారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి, కాటారం డివిజన్లకు సంబంధించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

News February 14, 2025

రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తాం: ట్రంప్

image

ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ (పరస్పర) సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. US నుంచి ఆయా దేశాలు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ ఎక్కువ టారిఫ్స్ వసూలు చేస్తోందని తెలిపారు. తాము కూడా భారత్‌ నుంచి అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు.

News February 14, 2025

బిచ్కుంద: బస్టాండ్ ఆవరణలో వ్యక్తి మృతి

image

బిచ్కుంద బస్టాండ్ ఆవరణలో పుల్కల్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అక్కడికి చేరుకుని పరిశీలించి చూడగా మద్యం సేవించి ఉన్న సమయంలో ఫిట్స్ వచ్చాయని స్థానికులు చెప్పినట్లు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!