News February 18, 2025

కరీంనగర్: జీవం తీస్తున్న ఆన్లైన్ జూదం..!

image

ఇద్దరు యువకులు ఆన్‌లైన్ మోసాలకు బలైన ఘటన శంకరపట్నం మండలంలో జరిగింది. గద్దపాకకి చెందిన భూస కార్తిక్(25) ఆన్‌లైన్ రమ్మీ ఆడి రూ.15లక్షలు మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పలపల్లికి చెందిన ఎడిగమధు(35) అనే యువ రైతు ఆన్‌లైన్ జూదంలో రూ. 10 లక్షలు మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగుల పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News July 6, 2025

KNR నుంచి అరుణాచలానికి RTC ప్రత్యేక బస్సు

image

ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి KNR 1 డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ నెల 8న KNR బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తదుపరి రాత్రికి అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనం అనంతరం 10న అరుణాచలం నుంచి మధ్యాహ్నం బయలుదేరుతుందన్నారు. మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత 11వ తేదీ సాయంత్రం వరకు KNRకు చేరుకుంటుందన్నారు.

News July 6, 2025

కరీంనగర్: ఈ నెల 13లోగా అప్లై చేయాలి

image

జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 13లోగా http://nationalawardstoteachers.education.gov.in వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలని కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News July 6, 2025

KNR: ‘జూనియర్ కళాశాలల్లో నమోదు పెంచాలి’

image

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో జూనియర్ కాలేజీ విద్యార్థుల వసతి అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.