News February 16, 2025
కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News November 15, 2025
యాంటీబయాటిక్స్‌తో ఎర్లీ ప్యూబర్టీ

పుట్టిన తొలినాళ్లలో యాంటీబయోటిక్స్ వాడిన ఆడపిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వస్తున్నట్లు తాజా అధ్యయంలో వెల్లడైంది. దక్షిణ కొరియాకి చెందిన యూనివర్సిటీ ఆసుపత్రులు చేసిన అధ్యయనంలో ఏదైనా అనారోగ్య కారణంతో ఏడాదిలోపు- ముఖ్యంగా తొలి మూడునెలల్లో- యాంటీబయోటిక్స్ తీసుకున్న ఆడపిల్లల్లో 22 శాతం మంది ఎనిమిదేళ్లకంటే ముందుగానే రజస్వల అవడాన్ని గమనించారు. ఈ పరిస్థితిని సెంట్రల్ ప్రికాషియస్ ప్యుబర్టీ అంటారు.
News November 15, 2025
విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

TG: ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు ఈసారి అన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. గతంలో జీవ, భౌతిక, సాంఘికశాస్త్రం, గణితం సబ్జెక్టు మెటీరియల్సే అందజేసేది. ఈసారి వాటితో పాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకూ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈనెలలో పంపిణీ చేసేందుకు 2 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.7.52 లక్షల స్టడీ మెటీరియల్స్ సిద్ధం చేయిస్తోంది.
News November 15, 2025
ఏలూరు: నడిరోడ్డుపై భార్య హత్య.. భర్త అరెస్ట్

విజయవాడలోని సూర్యారావుపేట వద్ద <<18282978>>గురువారం మధ్యాహ్నం నూజివీడులోని అజరయ్యపేటకు చెందిన సరస్వతిని<<>> ఆమె భర్త విజయ్ హత్య చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య కలహాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నిందితుడు విజయ్‌ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ ఆలీ చెప్పారు. అతని వద్ద నుంచి రెండు పదునైన ఆయుధాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు.


