News February 16, 2025

కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

image

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Similar News

News November 7, 2025

SKLM: సెకండ్ సాటర్డే సెలవులు రద్దు

image

రానున్న ఏడాది ఫిబ్రవరి నెల వరకు సెకండ్ సాటర్డే సెలవులు ఉండవని డీఈవో కే.రవిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు యథావిధిగా జిల్లాలో పాఠశాలలు నడుస్తాయన్నారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ సందర్భంగా సెలవులను వీటి ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వచ్చాయని, విద్యాసంస్థలు ఈ విషయాన్ని గ్రహించాలని ఆయన కోరారు.

News November 7, 2025

ప్రచారం తప్ప బాబు చేసిందేమీ లేదు: కన్నబాబు

image

AP: డేటా ఆధారిత పాలన అంటూ ప్రచారమే తప్ప CM CBN చేసిందేమీ లేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ‘500 వాట్సాప్ సేవల ద్వారా ఆన్లైన్లోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. మరి లోకేశ్ ప్రజాదర్బార్‌కు 4వేల అర్జీలు ఎందుకు వచ్చాయి? ప్రతిసారీ ఓ కొత్తపదంతో పబ్లిసిటీ చేసుకుంటూ మోసగించడం చంద్రబాబుకు అలవాటు’ అని విమర్శించారు. సచివాలయం వంటి వ్యవస్థలను తెచ్చి జగన్ చరిత్రలో నిలిచారన్నారు.

News November 7, 2025

HYD సైబర్ క్రైమ్ దుమ్మురేపే ఆపరేషన్

image

HYD సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ ఆపరేషన్‌లో భారీ దందాలు ఛేదించారు. మొత్తం 196 కేసులు, 55 అరెస్టులు, ₹62 లక్షల రిఫండ్ చేశారు. డిజిటల్ అరెస్ట్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ & ట్రేడింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాల్లో దేశంలోని 8 రాష్ట్రాల నుంచి నిందితులు పట్టుబడ్డారు. సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల్లో రూ.107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. మరిన్ని కేసుల్లో రూ.లక్షల్లో రిఫండ్ చేశారు.