News February 12, 2025
కరీంనగర్: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు
కరీంనగర్ డివిజన్‌లో 50 జీడీఎస్ పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ జ్ఞానం ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News February 12, 2025
భద్రాద్రి: నిధులు దుర్వినియోగం.. ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష
భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో రూ.23,89,750 ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై భద్రాచలం జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివనాయక్ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో అప్పటి పంచాయతీ కార్యదర్శి బత్తిన శ్రీనివాస రావు, సర్పంచ్ ధరావత్ చందునాయక్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని బూర్గంపాడు SI రాజేశ్ తెలిపారు.
News February 12, 2025
2కె రన్ ప్రారంభించిన వరంగల్ సీపీ
‘SAY NO TO DRUGS,’ డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం అనే నినాదంతో వరంగల్ నగరంలో ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్(TSJU) ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. పోచంమైదాన్ కూడలి నుంచి కేఎంసీ వరకు జరుగుతున్న ఈ రన్‌ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, వరంగల్ జిల్లా ఉన్నతాధికారులు, వైద్యులు, యువత పాల్గొన్నారు.
News February 12, 2025
మార్కెట్లోకి BE6, XEV9 కార్లు
అనంతపురం MGB మొబైల్స్ మహీంద్రా బ్రాంచ్ ప్రతినిధులు BEV BE6, XEV9E మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేశారు. మహీంద్రా AI ఆర్కిటెక్చర్, 110 cm వైడ్ సినిమా స్కోప్ లగ్జరీ డిస్‌ప్లేతో పాటు Z క్లాస్ సెక్యూరిటీతో 5 కెమెరాలను కలిగి ఉంది. ఆటో పార్కింగ్ సదుపాయం కూడా ఉండగా దీని ధర రూ.18.9 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని అన్నారు. ఏపీలో దీనిపై లైఫ్ టాక్స్ లేదు.