News November 20, 2025
కరీంనగర్: డయల్ 100కు 47,481 కాల్స్

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ‘విజిబుల్ పోలీసింగ్ సిస్టం’ పకడ్బందీగా అమలవుతోంది. డయల్ 100 ద్వారా ఈ మధ్య కాలంలో 47,481 కాల్స్ రాగా, అందులో 2,547 ప్రమాదాలు, 493 ఆత్మహత్యాయత్నాలు, 5,961 మహిళల పట్ల అసభ్య ప్రవర్తన కేసులు ఉన్నాయి. దీంతో ఘటన ఏదైనా డయల్ 100కు కాల్ చేయాలన్న చైతన్యం ప్రజల్లో పెరిగినట్లు స్పష్టమవుతోంది.
Similar News
News November 20, 2025
విజయవాడ: రెచ్చిపోతున్న రేషన్ మాఫియా డాన్.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేదల బియ్యాన్ని దేశ సరిహద్దులు దాటించే రేషన్ మాఫియా డాన్ ఆగడాలు శృతిమించుతున్నాయి. నియోజకవర్గానికి ఒకరు చొప్పున నియమించుకొని బియ్యాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు సైతం నెలకు రూ.7 నుంచి రూ. 10 లక్షల వరకు ఈ మాఫియా డాన్ అవినీతి సొమ్మును ముట్ట చెబుతున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల అండ ఉండడంతో అధికారులు కన్నెత్తైనా చూడలేకపోతున్నారు.
News November 20, 2025
మెదక్: ‘కల్లుగీత కార్మికులకు హామీలు నెరవేర్చాలి’

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్‌లో గురువారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆరవ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. గౌడ కులస్తులకు బడ్జెట్లో రూ.5000 కోట్లు కేటాయించాలని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News November 20, 2025
ఏపీకి మళ్లీ వర్ష సూచన

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. తర్వాతి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేటి నుంచి ఆదివారం వరకు ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.


