News December 18, 2025
కరీంనగర్ డిఎంఅండ్ హెచ్‌వోకు ఆశా వర్కర్ల వినతి

ఆశా వర్కర్లకు క్షయవ్యాధి సర్వే పెండింగ్ బిల్లులు తక్షణమే అందించాలని కోరుతూ కరీంనగర్ డిఎంఅండ్ హెచ్వో కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 18వ తేదీ నుండి లెప్రసీ సర్వే ప్రారంభం కానుందని జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలత అన్నారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సర్వే బిల్లులు చెల్లించాకే విధులకు హాజరవుతామని హెచ్చరించారు.
Similar News
News December 21, 2025
కరీంనగర్: సోమవారం జరగాల్సిన ‘ప్రజావాణి’ రద్దు

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, అధికారులు ఆ ఏర్పాట్లలో నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి ఈ నెల 29 నుంచి ప్రజావాణి యథాతథంగా కొనసాగుతుందని, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.
News December 20, 2025
కరీంనగర్: పోగొట్టుకున్న 60 మొబైల్ ఫోన్ల రికవరీ

పోగొట్టుకున్న ఫోన్లను కరీంనగర్ టౌన్ పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. CEIR పోర్టల్ ద్వారా రూ.10 లక్షల విలువైన 60 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఏసీపీ తెలిపారు. శనివారం వీటిని బాధితులకు అందజేశారు. మొబైల్స్ పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. పోలీసుల పనితీరుపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
News December 20, 2025
కరీంనగర్: ‘సమిష్టి కృషితోనే ఎన్నికలు విజయవంతం’

పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమిష్టిగా బాధ్యతాయుతంగా నిర్వహించిన అధికారుల తీరు అభినందనీయమని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. శనివారం ZP CEO శ్రీనివాస్ ఆధ్వర్యంలో MPDOలు అదనపు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పూలబోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ పకడ్బందీగా వ్యవహరించడం వల్లే ప్రక్రియ సమర్థవంతంగా పూర్తయిందని కొనియాడారు.


